: 'పీఎంవో మొబైల్ యాప్' రూపకల్పనలో గూగుల్ సాయం


దేశ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న మొబైల్ యాప్ అప్లికేషన్ కు ఆన్ లైన్ దిగ్గజ సంస్థ గూగుల్ తనవంతు సాయం అందించనుంది. mygov.in వెబ్ సైట్ తో కలసి ఈ యాప్ తయారీలో పాల్గొననున్నట్టు ఓ ప్రకటన విడుదలైంది. ఇందుకోసం నిర్వహిస్తున్న పోటీ రేపు సాయంత్రం 5 గంటలకు mygov.in సైట్ లో మొదలవుతుంది. దేశంలోని పలు సంస్థలు, కళాశాలల్లో పోటీ నిర్వహిస్తుండగా, ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనవచ్చు. ఇటు గూగుల్ స్పందిస్తూ, ప్రధానమంత్రి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ప్రతిఒక్కరూ ముందుకొచ్చి యాప్ రూపకల్పనలో పాల్గొనాలని కోరింది.

  • Loading...

More Telugu News