: ఫేస్ బుక్ లో అన్నా హజారేకు 'హత్యా' బెదిరింపులు... ఎఫ్ఐఆర్ నమోదు


సామాజిక కార్యకర్త, ప్రముఖ గాంధేయవాది అన్నా హజారేకు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా హత్యా బెదిరింపు సందేశాలు వచ్చాయి. వెంటనే విషయాన్ని ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... కెనడాకు చెందిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక భూసేకరణ చట్టంపై మూడు నెలల పాటు 1,100 కిలో మీటర్ల పాదయాత్ర చేయబోతున్నట్టు హజారే ప్రకటించారు. ఈ క్రమంలోనే బెదిరింపులు వచ్చినట్టు తెలిసింది. ఈ యాత్ర వార్దాలోని గాంధీ ఆశ్రమం నుంచి ఢిల్లీలోని రాంలీలా మైదానం వరకు కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News