: ఏపీలో పెట్టుబడులకు సిద్ధం... చంద్రబాబు ఆహ్వానం మేరకే వచ్చామంటున్న జపాన్ బృందం


నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని జపాన్ ప్రతినిధుల బృందం ప్రకటించింది. నేటి ఉదయం ఏపీలో పర్యటించేందుకు వచ్చిన జపాన్ ప్రతినిధుల బృందం విజయవాడలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైంది. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం సభ్యులు మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకే ఇక్కడికొచ్చామని ప్రకటించారు. అంతేకాక ఇక్కడి పరిస్థితులు తమ పెట్టబడులకు అనుకూలంగా ఉన్నాయని కూడా వారు పేర్కొన్నారు. ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం చంద్రబాబు జపాన్ లో పర్యటించిన విషయం తెలిసిందే. సదరు పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News