: రెండు పదవులను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నా: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ పదవికి రాజీనామా అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. రెండు పదవులను సమర్థవంతంగా నిర్వహించటం సాధ్యం కావట్లేదని అన్నారు. ఇక ఢిల్లీలో పరిపాలనపై దృష్టి పెడతానని తెలిపారు. పార్టీ కన్వీనర్ గా, సీఎంగా కొనసాగుతున్న కేజ్రీవాల్ పై పార్టీ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు ప్రశ్నించడంతో కేజ్రీ వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈరోజు జరిగే పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వారిద్దరినీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి తీసివేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.