: వైభవంగా మంచు మనోజ్ నిశ్చితార్థం... చంద్రబాబు, షిండే హాజరు


ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు, యువ హీరో మంచు మనోజ్ వివాహ నిశ్చితార్థం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో జరుగుతున్న ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు సహా పలువురు ప్రముఖ నటులు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తదితర రాజకీయ ప్రముఖులూ ఈ వేడుకకు హాజరయ్యారు. తాను ప్రేమించిన ప్రణతినే మనోజ్ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News