: రాజమండ్రి కార్పొరేషన్ లో బిగ్ ఫైట్... కొట్టుకున్న అధికార, విపక్ష కార్పొరేటర్లు


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ లో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో భాగంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు. సమావేశం ప్రారంభం కాగానే కార్పొరేషన్ పరిధిలోని అధికారుల అవినీతిపై వాడీవేడి చర్చ సాగింది. ఈ సందర్భంగా విచక్షణ కోల్పోయిన కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమావేశంలో సభ్యుల మధ్య బాహాబాహీ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News