: ఆర్టీఏ అధికారులుగా అవతారమెత్తి అడ్డంగా దొరికిపోయిన విలేకరులు
ఆర్టీఏ అధికారులమని చెప్పి లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు విలేకరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఖమ్మంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు బైపాస్ రోడ్డులో లారీలు ఆపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో లారీ డ్రైవర్లకు, వారికి మధ్య తగాదా జరగడంతో డ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారించగా, వారు ఓ న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న రిపోర్టర్లు శివ, నాగరాజుగా గుర్తించారు. వారి నుంచి ఐడీ కార్డులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.