: అవినీతి తిమింగలం... రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ట్రాన్స్ కో ఏడీఈ!
ప్రభుత్వ శాఖల్లో అతినీతి మేటలు పెరిగిపోతున్నాయి. సర్కారీ వేతనం తీసుకుని పనిచేయాల్సిన అధికారులు ఆయా వర్గాల నుంచి ముడుపులు అందనిదే కార్యరంగంలోకి దిగడం లేదు. లంచగొండి ప్రభుత్వాధికారుల భరతం పడుతున్న అవినీతి నిరోధక శాఖకు నేటి ఉదయం ఓ భారీ అవినీతి తిమింగలం దొరికింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ట్రాన్స్ కో ఏడీఈగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కొద్దిసేపటి క్రితం ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటున్న చంద్రశేఖర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.