: రేణిగుంట విమానాశ్రయం ఏటీసీ వ్యవస్థలో లోపం... విమానాల మళ్లింపు


ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతికి విమానంలో వెళ్లే ప్రయాణికులకు చేదు వార్త. రేణిగుంట విమానాశ్రయంలోని ఏటీసీ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాసేపటి క్రితం విమానాశ్రయంలో దిగాల్సిన స్పైస్ జెట్ విమానాన్ని... అధికారులు విధిలేని పరిస్థితుల్లో చెన్నైకి మళ్లించారు. మధ్యాహ్నం సర్వీసులను కూడా చెన్నైకి మళ్లించే అవకాశం ఉందని విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఏటీసీ లోపాన్ని సరిదిద్దే పని కొనసాగుతోంది. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నారు.

  • Loading...

More Telugu News