: యూఏఈపై విరుచుకుపడ్డ పాక్!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై పాకిస్థాన్ విరుచుకుపడింది. ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేపియర్ లో జరుగుతున్న పోటీలో అంతగా పసలేని యూఏఈ బౌలింగుని పాకిస్థాన్ బ్యాట్స్ మెన్లు ఆటాడుకున్నారు. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ సాధించారు. పాక్ జట్టులో నాసిర్ 4, షెహజాద్ 93, సోహయిల్ 70, మక్సూద్ 45, మిస్బా 65, అక్మల్ 19, అఫ్రిది 21, వహాబ్ 6 పరుగులు చేశారు. యూఏఈ బౌలింగులో గురుగే 4 వికెట్లు తీసి రాణించాడు. మరికాసేపట్లో 340 పరుగుల విజయలక్ష్యంతో యూఏఈ బరిలోకి దిగనుంది.