: పార్లమెంటుకు నేను కొత్త... రక్షించండి!: అన్సారీకి ప్రధాని మోదీ వేడుకోలు


‘‘అధ్యక్షా, నేను పార్లమెంటుకు కొత్త. నన్ను రక్షించండి’’ అంటూ నిన్న ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని వేడుకున్నారు. అయినా మోదీకి అంత ఇబ్బందేం వచ్చిందనేగా మీ సందేహం? దేశ రాజకీయాల్లో కాకలు తీరిన ఎస్పీ నేత శరద్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు ఒకేసారిగా మోదీపై దాడికి దిగారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా నిన్న రాజ్యసభలో మాట్లాడుతున్న మోదీని శరద్, మాయావతి అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డ మోదీ, అన్సారీని ఉద్దేశించి సదరు వ్యాఖ్యలు చేశారు. ఇలా అవసరం లేకున్నా, సెల్ఫ్ డిఫెన్స్ వ్యాఖ్యలు చేసిన మోదీ... సమ్మిళిత వృద్ధిపై శరద్, కార్పొరేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై మాయావతి సంధించిన ప్రశ్నలకు సమాధానాలను ఉద్దేశపూర్వకంగానే దాటవేశారు.

  • Loading...

More Telugu News