: చీటర్ ‘బాబు’, బినామీ ‘ఉమా’... మీకెందుకు అంత బాధ?: కొడాలి నాని ఫైర్


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(కొడాలి నాని) విరుచుకుపడ్డారు. జగన్ పర్యటనపై ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరుష పదజాలంతో స్పందించిన నేపథ్యంలో, కొడాలి నాని విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తే, మీకెందుకంత బాధ?’’ అంటూ మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత హోదాలో జగన్ తుళ్లూరులో పర్యటిస్తున్నారని కొడాలి నాని పేర్కొన్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. చీటర్ బాబుగా మారిన చంద్రబాబుకు దేవినేని ఉమా బినామీగా వ్యవహరిస్తున్నారని కూడా కొడాలి నాని కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు.

  • Loading...

More Telugu News