: గో బ్యాక్... గో బ్యాక్... నవ్యాంధ్ర రాజధాని పర్యటనలో జగన్ కు ఝలక్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న నవ్యాంధ్ర నూతన రాజధానిలో జరిపిన పర్యటనలో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజధాని నిర్మాణం కోసం వేల ఏకరాల భూములెందుకంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ‘‘మీ ఇంటి నిర్మాణం కోసం 18 ఎకరాల భూమి కావాలి. కాని రాజధాని నిర్మాణం కోసం మాత్రం వేల ఎకరాల భూమి వద్దా?’’, ‘‘భూ బకాసూరులా, రాజధాని రైతులకు న్యాయం చేసేది?’’ అంటూ రాసిన పోస్టర్లు దర్శనమిచ్చాయి. అంతేకాక ‘‘గో బ్యాక్.. గో బ్యాక్’’ అంటూ రాసి ఉన్న పోస్టర్లు కూడా కనిపించాయి. రాజధాని ప్రాంత రైతుల కమిటీ పేరిట వెలసిన సదరు పోస్టర్లను గుర్తించిన వైసీపీ నేతలు, జగన్ అక్కడికి చేరుకునేలోగానే తొలంగించారు.