: పూటుగా తాగేసి విద్యార్థినిని వేధించిన మేట్రిన్


పూటుగా తాగేసిన ఓ మహిళా మేట్రిన్ మద్యం మత్తులో ఓ విద్యార్థినిని వేధించిన ఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ బాలల సదన్ లో కలకలం రేపింది. పోలీసులు, విద్యార్థినుల తెలిపిన వివరాల ప్రకారం... మనూర్ మండలం ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని నారాయణఖేడ్‌ లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన బాలల సదన్ లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. దీనికి మేట్రిన్ గా పనిచేస్తున్న చంద్రకళ తన భర్త జగదీశ్వర్, ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే మరో వ్యక్తితో కలసి గత మూడు నెలలుగా అక్కడే మద్యం తీసుకుంటోంది. అంతటితో ఆగని చంద్రకళ బాలికను తాగుబోతు రామకృష్ణను పెళ్లి చేసుకోవాలని వేధిస్తోంది. ఆమె ఆగడాలను భరించలేకపోయిన విద్యార్థినులు ఏఐఎస్‌ఎఫ్ నాయకులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలి దగ్గర్నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News