: ధోనీ జులపాల జుట్టు పోవడం వెనుక కథ ఏంటో తెలుసా?


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరంగేట్రం చేసిన తొలినాళ్లలో ఎలా ఉండేవాడో గుర్తుందా? బ్యాటింగ్, కీపింగ్ కంటే జులపాల జుట్టుతోనే ధోనీ కీర్తినార్జించాడు. అంతెందుకు, ధోనీ హెయిర్ స్టైల్ కు అభిమానినని అప్పట్లో పాకిస్థాన్ అధ్యక్షుడు ముషారఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా ఎంతో మంది అభిమానుల్ని తన జులపాల జట్టుతో అలరించిన ధోనీ హెయిర్ స్టైల్ మార్పు వెనుక అతని భార్య సాక్షి ఉందట. ఆ జుట్టు కత్తిరించుకుని మోడ్రన్ గా కనిపిస్తేనే ప్రేమకు ఒప్పుకుంటానని షరతు పెట్టిందట. అంతే, ధోనీకి జుట్టు కత్తిరించుకోక తప్పలేదట. ఈ హెయిర్ కట్ ను బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంతో కలిసి చేయించుకున్నాడట. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సప్న (బిగ్ బాస్ కంటెస్టెంట్) వారికి జుట్టు కత్తిరించిందట. ఇప్పటికీ ఆమే తన హెయిర్ స్టైల్ ను తీర్చిదిద్దుతుందని, బాగుంటే హ్యాపీ, బాలేకుంటే సప్నా అలా చేసిందని ఆమె మీదికి తోసేస్తానని ధోనీ చెప్పాడు.

  • Loading...

More Telugu News