: టోకరా వేసిన మక్కా ట్రావెల్స్... విమానాశ్రయంలో ముస్లిం సోదరుల ఆందోళన


విజయవాడకు చెందిన 40 మంది ముస్లిం సోదరులు హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. మక్కా ట్రావెల్స్ కు చెందిన ప్రతినిధులు ముస్లింల పవిత్ర క్షేత్రం మక్కాను చూపిస్తామని 40 మంది ప్రయాణికుల నుంచి 50 వేల రూపాయల చొప్పున వసూలు చేశారు. అనంతరం వారిని విజయవాడ నుంచి ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయానికి పంపించారు. వారిని అక్కడ దించేసిన బస్సు వెనుదిరిగింది. మక్కా వెళ్లే విమానం ఎక్కుదామని నిరీక్షించిన ప్రయాణికుల వద్ద టికెట్లు, పాస్ పోర్టులు, వీసా వంటివి లేకపోవడంతో విమానాశ్రయాధికారులు వారిని అడ్డుకున్నారు. దీంతో జరిగిన మోసం గుర్తించి వారు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News