: పార్టీని వీడే ప్రసక్తి లేదు: యోగేంద్ర యాదవ్


ఆమ్ ఆద్మీ పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా ఆప్ లో ఏర్పడిన అంతర్గత విభేదాలపై కేజ్రీవాల్ కూడా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబం అన్నాక అభిప్రాయభేదాలు సర్వసాధారణమని అన్నారు. భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన కుటుంబాన్ని కూల్చేసుకుంటామా? అని ప్రశ్నించారు. మనం ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఓపిక చూపుతామని, రాజకీయాల్లో అది మరింత అవసరం అని యోగేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. ఆప్ తమ నలుగురికే చెందిన పార్టీ కాదని చెప్పేందుకు గర్వపడుతున్నానని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News