: ఒబామా రోజంతా ఒక్క సూట్ ధరిస్తే... మోదీ నాలుగు డ్రెస్ లు మార్చారు: అక్బరుద్దీన్


ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనవరిలో భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆకట్టుకునేందుకు గణతంత్ర దినోత్సవం రోజున మోదీ తన దుస్తులు మార్చారని వ్యాఖ్యానించారు. "ఒక్కరోజులోనే ఆయన (ప్రధాని) నాలుగుసార్లు దుస్తులు మార్చారు. ఏకంగా రూ.10 లక్షల సూట్ ధరించారు. కానీ అదేరోజు ఒబామా కేవలం ఒక్కసూట్ తోనే ఉన్నారు" అని అక్బరుద్దీన్ పరిహాసం చేశారు. అధికారంలోకి వచ్చాక మోదీకీ ఎలా పాలించాలో తెలియడం లేదన్నారు. తన జపాన్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి షింజో అబేకు భగవద్గీత కాపీ ఒకటి మోదీ ఇచ్చారన్న అక్బరుద్దీన్, ఆయనే గనుక లౌకికవాది అయితే భారత రాజ్యాంగ పుస్తకం ఒకటి ఇచ్చి ఉండాల్సిందన్నారు.

  • Loading...

More Telugu News