: మా పథకాలనే కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టింది: నరేంద్ర మోదీ
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ చేపట్టిన అభివృద్ధి పథకాలనే యూపీఏ ప్రభుత్వం పేర్లు మార్చి కొనసాగించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏదీ లేదని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని అన్నారు. తమకు అన్నీ తెలుసనే భ్రమలో లేమని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు పథకాలు పేర్లు చదివి వినిపించారు. గిరిజనులు ఎక్కువ మంది బీజేపీని ఎన్నుకున్నారని ఆయన చెప్పారు. సిక్కులు, ముస్లింలు ఇలా అంతా బీజేపీని ఎన్నుకున్నారని ఆయన పేర్కొన్నారు.