: ప్రకృతి వైద్య చికిత్స కోసం బెంగళూరు వెళుతున్న కేజ్రీవాల్


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొన్నాళ్లుగా హైలెవల్ షుగర్, దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకృతి వైద్య చికిత్స కోసం కేజ్రీ తరువాతి వారంలో బెంగళూరు వెళ్లనున్నారు. అంటే ఈ నెల 5న వెళ్లి దాదాపు 10 రోజుల పాటు చికిత్స తీసుకుంటారు. ఆసక్తికరంగా ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా నిరంతర దగ్గుతో ఇబ్బందిపడుతున్న కేజ్రీకి బెంగళూరులోని యోగా థెరపిస్ట్ ను కలవాలని సూచించన సంగతి విదితమే. ఈ సమయంలో ఉపముఖ్యమంత్రి మనీష్ శిశోడియా తాత్కాలిక సీఎంగా వ్యవహరించి ప్రభుత్వ కార్యకలాపాలు చూస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News