: బుల్లితెర నటి సంధ్య ఫిర్యాదు... నిర్మాత చలపతి అరెస్ట్


బుల్లితెర నటిని వేధింపులకు గురిచేసి ఓ నిర్మాత కటకటాలు లెక్కిస్తున్నాడు. టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తున్న సంధ్య అనే యువతి ఫిర్యాదు మేరకు నిర్మాత చలపతిని ఎస్ఆర్ నగర్ పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. చలపతి తనను తరచూ వేధింపులకు గురిచేస్తున్నారని సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేపట్టి విచారణ చేపట్టిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News