: పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ నియామకాన్ని సమర్థిస్తున్నా: పొన్నం


తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించడాన్ని సమర్థిస్తున్నట్టు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం సరైన నిర్ణయమే తీసుకుందన్నారు. అటు రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు కావాలంటూ బీజేపీ, టీఆర్ఎస్ కార్యాలయాలను ముట్టడించాలని పొన్నం న్యాయవాదులకు సూచించారు. అప్పుడే రెండు పార్టీలు తెలంగాణకు కోర్టు విషయంలో దిగొస్తాయన్నారు. కొన్ని రోజుల నుంచి వారు ఆందోళన చేస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రత్యేక హైకోర్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ కూడా అన్యాయం చేసిందన్నారు.

  • Loading...

More Telugu News