: ఏపీని దేవుడో, కేంద్రమో రక్షించాలి: రాజ్యసభలో సుబ్బరామిరెడ్డి


కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని దేవుడైనా రక్షించాలి, లేదా కేంద్రమైనా ఆదుకోవాలి అని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారంటూ ఏపీ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ, ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News