: నెల్లూరులో స్కూల్‌ యజమాని కుమారుడి కిడ్నాప్‌... రూ. కోటిన్నర ఇవ్వాలని డిమాండ్‌


ఓ స్కూల్‌ యజమాని కుమారుడిని కిడ్నాప్‌ చేసి కోటిన్నర ఇవ్వాలని, లేకుంటే బాలుడిని హత్య చేస్తామని బెదిరింపులకు దిగిన ఘటన నెల్లూరు జిల్లాలో, సైదాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సైదాపురంలో మహేందర్ రెడ్డి లక్ష్మీ విద్యానికేతన్‌ పేరిట ఒక స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు మోహిత్‌ (3), నిఖిల్‌ (9నెలలు) ఉన్నారు. మహేందర్ రెడ్డికి ఇటీవల దినేష్‌ అనే వ్యక్తితో పరిచయం అయింది. ఈ రోజు ఉదయం మహేందర్‌రెడ్డి ఇంటికొచ్చిన దినేష్‌, మీ అబ్బాయిని కిడ్నాప్‌ చేస్తే ఎంతిస్తావు? అని ప్రశ్నించాడు. ఏదో సరదాగా మాట్లాడుతున్నాడులే అనుకొని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కొంతసేపటికి మహేందర్‌ రెడ్డికి ఫోన్‌ చేసి మీ అబ్బాయి మోహిత్‌ ను కిడ్నాప్‌ చేశామని, రూ.1.50కోట్లు ఇస్తే వదిలేస్తామని కొందరు దుండగులు బెదిరించారు. డబ్బు ఇవ్వకుంటే బాబును చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ కిడ్నాప్‌ విషయాన్ని మహేందర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దినేష్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News