: సల్మాన్ ఖాన్ కు స్వైన్ ఫ్లూ పరీక్షలు


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయించుకుంటున్నాడు. ప్రస్తుతం సూరజ్ బరజాత్యా నిర్మిస్తున్న 'ప్రేమ రతన్ ధన్ పాయో' చిత్రంలో నటిస్తున్న ఆయన, సహనటి సోనమ్ కపూర్ కు స్వైన్ ఫ్లూ వైరస్ సోకడంతో, ముందు జాగ్రత్త చర్యగా ఈ పరీక్షకు సిద్ధం అయ్యాడట. కాగా, ఈ వ్యాధిబారిన పడ్డ సోనమ్ ప్రస్తుతం ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కోలుకుంటున్నట్టు సమాచారం. ఈ మహమ్మారి మహారాష్ట్ర, గుజరాత్ లలో అధిక ప్రభావం చూపుతోంది. స్వైన్ ఫ్లూ బారినపడి దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News