: ప్రియురాలి ఆత్మహత్య... పోలీసుల వేధింపులతో ప్రియుడి మృతి


వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పడంతో మూడు రోజుల క్రితం ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆ వెంటనే డిగ్రీ చదువుతున్న తమ కూతురు రాధికను ఆకతాయిలు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి అమ్మాయి ప్రేమించిన పీజీ విద్యార్థి ఎడుపుల భూమేష్ (23)ను స్టేషనుకు పిలిపించి తమదైన శైలిలో విచారించారు. ప్రియురాలి మృతి, సీఐ ముందు కానిస్టేబుల్ కొట్టడంతో, మనస్తాపం చెందిన భూమేష్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో జరిగింది. ఈ విషయమై పోలీసుల వర్షన్ వేరుగా వుంది. అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ జరిపామని, భూమేష్‌ పై చెయ్యి చేసుకోలేదని వివరణ ఇచ్చారు. వారిద్దరూ ప్రేమించుకున్న విషయం నిజమని వాయిస్ రికార్డు, కాల్ డేటా నిరూపించినట్టు తెలిపారు. కాగా, మూడు రోజులుగా విచారణ పేరిట తమ బిడ్డను వేధించి కొట్టారని భూమేష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News