: ధూమపానం మాన్పించే ఈ`సిగరెట్
ఎలక్ట్రానిక్ సిగరెట్టు తాగడం అనేది.. ధూమపాన దురలవాటు ఉన్న ప్రతి పదిమందిలో 9 మంది దాన్ని మానుకునేలా ప్రేరేపిస్తోందని ఓ అధ్యయనం చెబుతోంది. ఈ సిగరెట్ వినియోగం, పొగాకు తాగడంపై దాని ప్రభావం గురించి నిర్వహించిన ఆన్‌లైన్ సర్వే ఫలితాలను బట్టి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ`సిగరెట్ల తయారీలో అగ్రగాములు అయిన రెండు సంస్థలకు చెందిన వినియోగదారుల నుంచి ఈ సర్వే నిర్వహించారు.
వారిలో 75 శాతం మంది.. ఈ `సిగరెట్ అలవాటయ్యాక, తాము ధూమపానం చేసి అనేక వారాలు గడచిపోయినట్లుగా చెప్పారు. 91 శాతం మంది.. పొగాకు సిగరెట్‌లు తాగాలనే తపనను ఈ సిగరెట్ చంపేసినట్లు చెప్పారు. అయితే ఈ సర్వేను ఆ కంపెనీల వినియోగదారులే తమ ఇష్టానికి ఎంచుకుని ఆన్సర్ చేసే వీలు కల్పించడం వలన.. దీని ఫలితాలకు కొంత పరిమితులు ఏర్పడ్డాయి. అందువలన ఇవి పూర్తిస్థాయి ఫలితాలు కాకపోవచ్చునని అధ్యయనం నిర్వహించిన వారు చెబుతున్నారు.