: ఇలాగైతే ఓటమే... మోదీకి చిన్న తమ్ముడి చురకలు!


ముంబైలోని ఆజాద్ మైదానంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో ప్రధాని నరేంద్ర మోదీ చిన్న సోదరుడు ప్రహ్లాద్ మోదీ పాల్గొని బీజేపీపై విమర్శలు గుప్పించారు. అల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన, తన 45 నిమిషాల ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు. తమ డిమాండ్లు అంగీకరించకుంటే రానున్న బీహార్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూస్తుందని ఆయన హెచ్చరించారు. ఒక్కో రేషన్ డిస్ట్రిబ్యూటర్ కు కనీసం 1000 కార్డుదారులు ఉండాలని, కమీషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గత యూపీ ఎన్నికల్లో సుమారు 75 వేల మంది డీలర్లు బీజేపీకి అనుకూలంగా పనిచేశారని, అందువల్లే 73 స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగిందని అన్నారు. తక్షణం తమ డిమాండ్లు పరిష్కరించకుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారని చెప్పారు. "నా అన్నను గౌరవిస్తాను. మా పోరాటం ఆయనపై కాదు. ప్రభుత్వం, వ్యవస్థపై" అని అన్నారు.

  • Loading...

More Telugu News