: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండో రోజు మద్యం డిపోల మూసివేత
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండో రోజు కూడా పలు మద్యం డిపోలు మూతబడ్డాయి. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు... ప్రస్తుత రెండు రాష్ట్రాల్లోని పలు బెవరేజెస్ ఐటీ శాఖకు రూ.8వేల కోట్ల మేర బకాయిపడ్డాయి. ఇంతవరకు ఆ నగదు చెల్లించకపోవడంతో ఐటీ శాఖ నిన్న (సోమవారం) నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో మద్యం సరఫరా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. దాంతో ఏపీలో 22, తెలంగాణలో 17 మద్యం డిపోలకు సరఫరా ఆగిపోగా, మూసివేయాల్సి వచ్చింది.