: చెలరేగుతున్న ఐర్లాండ్ బౌలర్లు... మూడో ఓవర్ లోనే వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
వరల్డ్ కప్ లో పసికూనలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. బౌలింగుతో పాటు బ్యాటింగులోనూ రాణిస్తున్న చిన్న జట్లు టైటిల్ ఫేవరెట్లకు చెమటలు పట్టిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం కాన్ బెర్రాలో ప్రారంభమైన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లకు ఐర్లాండ్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. పదునైన బంతులతో విరుచుకుపడుతున్న ఐర్లాండ్ బౌలర్ జాన్ మూనీ తన రెండో ఓవర్ లోనే డికాక్ వికెట్ తీసి సఫారీలకు షాకిచ్చాడు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు 12 పరుగులకే కీలక వికెట్ కోల్పోయారు. ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.