: లిప్ స్టిక్ పై 'చుక్క' పెట్టాలా? వద్దా?


పెదవుల అందాన్ని మరింతగా పెంచే లిప్ స్టిక్ శాకాహారమా? మాంసాహారమా?... ఈ డౌట్ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా? లిప్ స్టిక్ పై వెజ్, నాన్ వెజ్ సింబల్ చూపించే 'చుక్క' తప్పనిసరిగా ఉంచాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది ఒక నోటిఫికేషన్ జారీచేసింది. జంతువుల నుంచి తీసే నూనె, కొవ్వు, ఎముకల పొడి తదితరాలు వాడితే సదరు ఉత్పత్తిపై ఎరుపు లేదా గోధుమ రంగు చుక్క ఉండాలని, పూర్తిగా శాకాహార పదార్థాలే వాడితే ఆకుపచ్చ రంగు చుక్క ఉండాలని సూచించింది. సౌందర్య సాధనాలతో పాటు సబ్బు, షాంపూ, టూత్‌ పేస్ట్ లాంటి వాటిపై కూడా ఇదే విధానాన్ని పాటించాలని చెప్పింది. ఈ విషయంలో సౌందర్య ఉత్పత్తుల కంపెనీ రెకిట్ బెన్కిసర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తినే పదార్థాల విషయంలో ఇలా అడిగితే ఓకేగాని, సౌందర్య సాధనాలు, సబ్బుల లాంటి వాటికి ఇలా అడగడంలో అర్థం లేదని వాదనలు వినిపించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోరింది. ఈ కేసులో మే 18లోగా స్పందించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News