: ఎప్పుడూ అవే ప్రశ్నలేనా?... విలేకరులపై సోనియాగాంధీ విసుగు!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. దాదాపుగా విలేకరుల ముందుకు ఎప్పుడో కాని రాని ఆమె, నిన్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీలో రాహుల్ గాంధీకి మరింత ప్రాధాన్యాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీంతో కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టిన సోనియా గాంధీ, ‘‘ఎప్పుడూ అవే ప్రశ్నలేనా? మాటిమాటికి ఇదే అడుగుతారు. అతడు సెలవు నుంచి రాగానే మీకు విషయం తెలుస్తుంది'’ అంటూ విసుక్కున్నారు. ప్రియాంకా గాంధీకి సంబంధించిన ప్రశ్నలకు సోనియా స్పందించలేదు.