: ఆదిలాబాదులో కేసీఆర్... కరీంనగర్ లో చంద్రబాబు: తెలంగాణలో ఇద్దరు సీఎంల పర్యటన
తెలంగాణలో నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ పర్యటించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదిలాబాదు జిల్లా పర్యటనకు వెళుతుండగా, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఆదిలాబాదు పర్యటనలో భాగంగా జైపూర్ లో సింగరేణి ఏర్పాటు చేస్తున్న విద్యుదుత్పత్తి కేంద్రంలో అదనపు యూనిట్ కు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక తెలంగాణ జిల్లాల పర్యటనలో భాగంగా నేడు చంద్రబాబు కరీంనగర్ కు వెళుతున్నారు. ఈ మేరకు టీ టీడీపీ నేతలు అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఎమ్మార్పీఎస్ నేతలు, తెలంగాణవాదుల నిరసనలు తప్పవన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.