: శేషాచలం అడవుల్లో మరోమారు కార్చిచ్చు... అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది


తిరుమల వెంకన్న కొలువై ఉన్న శేషాచలం అడవుల్లో మరోమారు కార్చిచ్చు చోటుచేసుకుంది. రేణిగుంట మండలం వెంకటాపురం పరిధిలోని అడవుల్లో నిన్న రాత్రి నిప్పు రాజుకుంది. క్షణాల్లో ఈ మంటలు వందలాది ఎకరాలకు విస్తరించాయి. అయితే మంటలను గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. శేషాచలం అడవుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో వందలాది ఎకరాల్లో అడవులు కాలి బూడిదవుతున్నాయి. తాజా ప్రమాదం నేపథ్యంలో రేణిగుంట మండలంలోని బలరామపురం, శేషాచల నగర్ వాసులు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు.

  • Loading...

More Telugu News