: అశ్విన్, షమి ఎగబాకితే... ధోనీ, కోహ్లీ దిగజారారు


ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత బౌలర్లు అశ్విన్, మహ్మద్ షమీ స్థానాలు మెరుగుపరుచుకోగా, టీమిండియా కెప్టెన్ ధోనీ, యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ ర్యాంక్ లు కోల్పోయారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ జాబితాలో షమీ 14 స్థానాలు మెరుగుపరచుకుని 11వ స్థానానికి చేరుకోగా, స్పిన్నర్ అశ్విన్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని 16వ ర్యాంక్ కు చేరుకున్నాడు. వరల్డ్ కప్ లో జరిగిన మూడు మ్యాచ్ లలో వీరిద్దరూ రాణించడంతో వారి ర్యాంక్ లు మెరుగుపడ్డాయి. కాగా, బ్యాటింగ్ జాబితాలో కోహ్లీ ఓ స్థానం దిగజారగా, ధోనీ రెండు స్థానాలు దిగజారాడు. దీంతో కోహ్లీ 4వ ర్యాంకులో ఉండగా, ధోనీ 10వ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలీర్స్ అగ్రస్థానంలో, సంగక్కర రెండు, ఆమ్లా మూడవ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News