: ఏం, వాళ్లే ఉద్యోగులా?...మాకూ పెంచండి: ఈయూ నేతల అల్టిమేటం
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా పీఆర్సీ పెంచాలని ఈయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాదులోని బస్ భవన్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ, తాము కూడా ప్రభుత్వ సర్వీసుల్లో భాగస్వాములమేనని, తమకు కూడా పీఆర్సీ వర్తింపచేయాలని అన్నారు. తమకు పీఆర్సీ వర్తింప చేయని పక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని డిపోల ఎదుట ఈ నెల 12న ధర్నాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వాలు దిగి రాని పక్షంలో ఈనెల 24న బస్ భవన్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.