: స్మగ్లర్ గంగిరెడ్డిని భారత్ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం


ఆంధ్రప్రదేశ్ వెతుకుతున్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని భారత్ కు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల మారిషస్ లో అరెస్టైన గంగిరెడ్డిపై సీఐడీ ఇచ్చిన నివేదికను అనుసరించి సికింద్రాబాదులోని పాస్ పోర్టు కార్యాలయం అతని పాస్ పోర్టును రద్దు చేసింది. దీంతో అతనిని స్వదేశం తీసుకురావడంలో అడ్డంకులు తొలగినట్టైంది. పాస్ పోర్టును రద్దు చేసిన సమాచారాన్ని పాస్ పోర్టు కార్యాలయం సీఐడీ అధికారులకు అందించినట్టు తెలుస్తోంది. కాగా, మారిషస్ లో పట్టుబడిన గంగిరెడ్డి అక్కడి న్యాయస్థానానికి రెండోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణను అక్కడి న్యాయస్థానం ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News