: నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు: ముఫ్తీ
జమ్మూకాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ సయీద్ స్పష్టం చేశారు. పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించినప్పటికీ ఆయన తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గకపోవడం విశేషం. దీనిపై శ్రీనగర్ లో వివరణ ఇస్తూ, హురియత్ కాన్ఫరెన్స్, పాకిస్థాన్, మిలిటెంట్ సంస్థలు సానుకూలంగా వ్యవహరించడం వల్లే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తాను భావిస్తున్నానని అన్నారు. పాకిస్థాన్, హురియత్ కాన్ఫరెన్స్ లు భారత రాజ్యాంగం గుర్తించినవేనని, వాటి గురించి మాట్లాడితే ఆందోళన చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.