: హాలీవుడ్ అపరిచితుడుగా లవర్ బాయ్


భారత్ లో బాక్సాఫీస్ ను పరుగులు పెట్టించిన 'అపరిచితుడు' లాంటి పాత్రతో హాలీవుడ్ లో ఓ సినిమా నిర్మించనున్నారు. 'మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్'తో బాధపడే వ్యక్తిగా విక్రమ్ భారతీయ ప్రేక్షకులను మెప్పించాడు. అలాంటి పాత్రను హాలీవుడ్ లో పోషించేదెవరంటే 'టైటానిక్' సినిమాతో కోట్లాది సినీ అభిమానులను అలరించిన లియోనార్డో డికాప్రియో. డేనియల్ కేయస్ రాసిన నవల 'బిల్లీ మిల్లీగాన్' కధను 1997లో డికాప్రియోకు నిర్మాతలు వినిపించారు. తరువాత కొన్ని కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ సినిమాను నిర్మించేందుకు డికాప్రియో సిద్ధమయ్యారు. తన సొంత బ్యానర్ 'అప్పియాన్ వే'పై మరో ఇద్దరితో కలిసి ఈ సినిమాను ఆయన నిర్మించనున్నారు. ఈ సినిమాలో డికాప్రియో 24 పాత్రలు పోషించనుండడం విశేషం.

  • Loading...

More Telugu News