: తెలంగాణలో ఆన్ లైన్ లో ఇసుక బుకింగ్ సదుపాయం... వెబ్ పోర్టల్ ప్రారంభం


తెలంగాణ రాష్ట్రంలో ఇకనుంచి ఆన్ లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వెబ్ పోర్టల్ ను నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో అత్యంత పారదర్శకంగా ఇసుక విక్రయిస్తామన్నారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక విక్రయించేందుకు కొత్త ఇసుక పాలసీ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆదాయం కోల్పోతున్నామనే కొంతమంది రాజకీయ నేతలు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మంత్రి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News