: ఎమ్మెల్సీలు ఎవడిక్కావాలి?... మేం ఏమన్నా బిచ్చగాళ్లమా?: కేవీపీ
ఎమ్మెల్సీలు ఎవడిక్కావాలి? మేం ఏమన్నా బిచ్చగాళ్లమా? అని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్రాన్ని నిలదీశారు. పునర్విభజన చట్టం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో ప్రధాని ప్రకటన చేశారని ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని ఎమ్మెల్సీల సంఖ్యను పెంచుతున్నారు? అని ప్రశ్నించారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏదయినా ఉంటుందా? అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడిగిన ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆంధ్రులు కోరుకుంటున్న పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్లు ముష్టి వేశారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడైనా మీరు కేటాయించిన మొత్తంతో మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయగలరా? అని ఆయన నిలదీశారు. తెలుగు ప్రజలను ఎందుకు అవమానిస్తున్నారని ఆయన అడిగారు.