: రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు (మంగళవారం) కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బస్సులో కరీంనగర్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎల్లనూరులో టీడీపీ కార్యకర్తలతో భేటీ అవుతారు. అనంతరం, 3 గంటల నుంచి 6 గంటల వరకు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ అవుతారు.