: కన్వీనర్ గా కేజ్రీవాల్ ను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం: ఆప్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ గా రెండు పదవుల్లో అరవింద్ కేజ్రీవాల్ కొనసాగుతుండటంతో పార్టీ పెద్దల నుంచి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన వెంటనే కన్వీనర్ పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ క్రమంలో పార్టీ జాతీయ కన్వీనర్ బాధ్యతల నుంచి ఆయన్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొంతమంది తమ పార్టీపై జోకులు వేస్తున్నారని, ఈ నెల 4న పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుందని, అందులో అన్ని విషయాలపై చర్చిస్తామని పార్టీ నేత సంజయ్ సింగ్ చెప్పారు. పార్టీలో విభేదాలపై అంతర్గతంగా చర్చిస్తాంకానీ, బహిరంగంగా కాదన్నారు.