: వీడియోలో కనిపించాలనే 'జిహాదీ జాన్' కుత్తుకలు కోశాడు: ఐఎస్ఐఎస్ మాజీ ఫైటర్
బందీల గొంతులను నిర్దయగా కోసి పలు వీడియోల్లో కనిపించి అగ్ర రాజ్యాలకు నిద్ర లేకుండా చేసిన 'జిహాదీ జాన్' అలియాస్ ఎమ్వాజీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. కేవలం వీడియోల్లో కనిపించాలన్న కోరికతోనే ఎమ్వాజీ కుత్తుకలు కోసేవాడని, యువతను ఆకర్షించేందుకు ఐఎస్ఐఎస్ అతనిని వాడుకుంటోందని మాజీ ఫైటర్ అబూ అయిమాన్ తెలిపాడు. తాను గతంలో ఐఎస్ లో ఉన్నప్పుడు ఒకసారి ఎమ్వాజీని కలిసానని, ఆతను మితభాషి అని, మిగతా వారితో పెద్దగా కలిసేవాడు కాదని వివరించాడు. బ్రిటన్ లోని ముస్లిమ్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ఎమ్వాజీని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించాడు. కాగా, లండన్లో 2005లో దాడికి ప్రయత్నించి విఫలమైన బృందంలో ఎమ్వాజీ సభ్యుడని అబ్జర్వర్, గార్డియన్ పత్రికలు ఒక కథనాన్ని ప్రచురించాయి.