: ఉగాదికి మెట్రో రైలు ప్రారంభం కావడంలేదు: మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి
ఈ ఉగాదికి హైదరాబాదు మెట్రో రైలు మొదటి దశను ప్రారంభించడం లేదని మెట్రోరైలు ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి ప్రకటించారు. కొన్ని ఇబ్బందుల దృష్ట్యానే దశల వారీగా ప్రారంభించలేమని చెప్పారు. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యాకే మెట్రోరైలును ప్రారంభిస్తామని తెలిపారు. నాగోల్-మెట్టుగూడ లైన్ పనులు పూర్తయిన నేపథ్యంలో, మార్చి 21న (ఉగాది నాడు) మెట్రో మొదటి దశ ప్రారంభిస్తామని ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.