: అజిత్, షాలినీ దంపతులకు పుత్రోదయం


కోలీవుడ్ దంపతులు అజిత్, షాలినీలకు పుత్రోదయం అయింది. ఈ ఉదయం షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అజిత్, షాలిని తొలిసారిగా 1999లో 'అమర్ కాలం' చిత్రంలో కలసి నటించి, అనంతరం ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో వీరిరువురూ వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారికి ఏడేళ్ల పాప వుంది. కొడుకు పుట్టడంతో, అజిత్ పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. చిత్రసీమలోని పలువురు ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News