: బీజేపీ పేరు చెబితేనే ఏపీ జనాలు బాధపడుతున్నారు... తెలుగుదేశం మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు రైల్వే బడ్జెట్, ఇటు సాధారణ బడ్జెట్లో చేకూరిన మేలు వీసమెత్తయినా లేకపోవడంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. తాజాగా, నేడు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పేరు చెబితేనే రాష్ట్ర ప్రజలకు బాధ కలుగుతోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 1600 కోట్లు కావాలని అడిగితే కేవలం రూ. 100 కోట్లు మాత్రమే ఇవ్వడం దారుణమని అన్నారు. అందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కలిసి కేంద్రం వద్దకు వెళ్లాలని నిశ్చయించుకున్నట్టు ఆయన వివరించారు.