: అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తాం, పోలవరంను పూర్తి చేస్తాం: మంత్రి ఉమా


ఏపీ నూతన రాజధాని నిర్మాణం కోసం 32 వేల ఎకరాల భూమిని సేకరించామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అలాగే, 2018 కల్లా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఎన్టీఆర్ మానసపుత్రిక అయిన హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తిచేసే భాగ్యం టీడీపీకి దక్కిందని... ప్రతి 15 రోజులకోసారి కాలువ పనులను పర్యవేక్షించి, పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ రోజు అనంతపురంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఆయన ఈ వివరాలు తెలిపారు.

  • Loading...

More Telugu News