: బీసీసీఐ చీఫ్ గా జగ్మోహన్ దాల్మియా ఏకగ్రీవం


బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా ఎన్నికయ్యారు. దశాబ్దం క్రితం భారత క్రికెట్ ను ఏలిన జగ్మోహన్ దాల్మియా, నాడు అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. శ్రీనివాసన్ రంగప్రవేశంతో దాదాపుగా తెరమరుగైన దాల్మియా, శ్రీనివాసన్ తెరమరుగవుతున్న సమయంలో పునరాగమనం చేశారు. ఐపీఎల్ వివాదం నేపథ్యంలో బీసీసీఐ ఎన్నికలకు శ్రీని దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలు వేడెక్కాయి. కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఈ పదవి కోసం తీవ్రంగా యత్నించారు. అందులో భాగంగా ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా రంగంలోకి దిగాలని యత్నించారు. అయితే, అవతలి వైపు నుంచి స్పందన లేని కారణంగా పవార్ వర్గం కూడా దాల్మియాకే మద్దతు పలకాల్సి వచ్చింది. నిన్న సాయంత్రం ముగిసిన గడువులోగా అధ్యక్ష పదవికి ఒక్క దాల్మియా మాత్రమే నామినేషన్ వేశారు. దీంతో, ఆయన ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెన్నైలో జరిగిన బీసీసీఐ సమావేశం అనంతరం ప్రకటించారు.

  • Loading...

More Telugu News