: హెల్మెట్ ను సొంతంగా డిజైన్ చేసుకున్న ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్... హ్యూస్ ఎఫెక్ట్
వరల్డ్ కప్ లో ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ జాన్ మూనీ బ్యాటింగ్ కు దిగినప్పుడు గమనించారా? హెల్మెట్ కు ముందు భాగంలో ఉండే గ్రిల్ వంటి నిర్మాణం మెడ భాగంలోనూ కనిపిస్తుంది. ఈ తరహా హెల్మెట్ ను మూనీ స్వయంగా డిజైన్ చేసుకోవడం విశేషం. ఈ అదనపు రక్షణ ఏర్పాటు ఎందుకంటే... మెడ భాగాన్ని బౌన్సర్ల తాకిడి నుంచి కాపాడుకునేందుకే. ఇటీవలే ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఫిల్ హ్యూస్ బంతి తగిలి ప్రాణాలు విడవడం తెలిసిందే. దీంతో, మూనీ పూర్తి రక్షణ కల్పించే హెల్మెట్ కోసం ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగి మెడ భాగంలోనూ గ్రిల్ ఉండేలా హెల్మెట్ రూపొందించాడు. ఆ అదనపు గ్రిల్ కు 'గోర్జెట్' అని పేరు పెట్టాడు. గోర్జెట్ అంటే ఫ్రెంచి భాషలో గొంతు అని అర్థమట. తన మామ సహాయంతో ఈ గోర్జెట్ ను డిజైన్ చేశానని మూనీ తెలిపాడు.